హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తిరుమలలో బుధవారం నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీ డీ అమలు చేయనుంది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, నగదు తిరిగి చెల్లింపు అంశా ల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. గదుల కేటాయింపు కౌంటర్లు, నగదు డిపాజిట్, తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద దీనిని ప్రారంభిస్తారు. రెండో వైకుంఠ క్యూకాంప్లెక్స్ నుంచి టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లడ్డూలను జారీ చేస్తారు.
ఈ విధానం వల్ల దళారు ల బెడదను అరికట్టడానికి మరింత అవకాశం ఉంటుంది. తిరుమలలో భక్తుల పాదరక్షలను భద్రపరిచేందుకు 11 కౌంటర్లను సిద్ధం చేస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.