హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆన్లైన్బుకింగ్లో అక్రమాలను అరికట్టేందుకు లక్షీడిప్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కోటాలో రోజుకు 1,500 మందికి శ్రీవాణి టికెట్లు జారీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.
విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాల నుంచి కూడా శ్రీవాణి కోట టికెట్లు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుడు విరాళాలు ఇచ్చి దర్శనం చేసుకోని 41వేల మంది భక్తులు జూన్ మొదటివారం నుంచి రోజుకు 300 టికెట్ల చొప్పున కేటాయించి, వచ్చే 5-10 నెలల్లో బ్యాక్లాగ్ పూర్తి చేస్తామని తెలిపారు. మరింత సమాచారం కోసం టీటీడీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.