హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమయ్యాడు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు. ప్రారంభం నుంచి అకడే ఉన్న దీవేటి సుబ్రహ్మణ్యం అనే ఉద్యోగి బుధవారం నుంచి కనిపించడం లేదు. దీంతో స్థానిక పోలీసులకు, టీటీడీ ఈవోకు ఉద్యోగులు సమాచారం అందించారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు. కాగా, తిరుపతికి చెం దిన బ్లిస్ హోటల్స్ గ్రూప్ చైర్మన్ ఎం సూర్యనారాయణరెడ్డి దంపతులు టీటీడీ ట్రస్ట్‌కు రూ.10,00,116 విరాళాన్ని అందజేశారు.