హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : 2026 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి వివిధ దర్శనాలు, గదుల కోటా షెడ్యూల్ను టీటీడీ సోమవారం ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన మార్చి కోటాను ఈనెల 18 ఉద యం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈనెల 20 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించింది. 20 నుంచి 22న మధ్యాహ్నం 12 గంటల్లోపు డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని పేర్కొన్నది.
22న ఆర్జిత సేవా టికెట్లు, 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల చేయనున్నట్టు తెలిపింది. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల చేస్తామని వెల్లడించింది. గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది. తిరుచానూరులో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన ఎన్ నిత్యశ్రీ దంపతులు సోమవారం స్వామివారికి 24 వెండికాసుల హారాన్ని బహూకరించారు.