హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. అక్టోబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ hytps//tirupatibalaji.ap.gov.in/లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది. తిరుమల, తిరుపతి, తలకోనల్లో వసతి గదుల కోటాను కూడా 26న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. అక్టోబర్లో దర్శనం కోసం సీనియర్ సిటిజన్లు, ది వ్యాంగుల కోటా టికెట్లు ఈ నెల 25న విడుదలవుతాయని తెలిపారు.