హైదరాబాద్ : ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీఎస్డబ్ల్యుఆర్ఈఐఎస్) మంగళవారం తుది గడువును పొడిగించింది. బీఎస్సీ (ఎంపీసీ), బీ.ఏ.(హెచ్ఈపీ) తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, భువనగిరి 2021-22 విద్యా సంవత్సరానికి గాను జూన్ 20 వరకు గడువును పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు, ఇతర వివరాల కోసం https://tswreis.in/ వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా సూచించారు.