Chandrugonda | పంచాయతీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలే.. చివరికి హెచ్ఎం ఏం చేశారంటే!
Chandrugonda | భద్రాద్రి జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెత్తాచెదారం కూడా పేరుకుపోవడంతో అపరిశుభ్రత నెలకొన్నది.
Chandrugonda | చండ్రుగొండ, అక్టోబర్ 3 : భద్రాద్రి జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెత్తాచెదారం కూడా పేరుకుపోవడంతో అపరిశుభ్రత నెలకొన్నది. దోమలు, పాములు, తేళ్లు వస్తున్నాయని.. పిచ్చిమొక్కలు, చెత్తను తొలగించాలని ప్రధానోపాధ్యాయుడు పంచాయతీ అధికారులు, సిబ్బందికి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో పాఠశాల హెచ్ఎం స్వయంగా రంగంలోకి దిగి ఆవరణను శుభ్రం చేశారు.
వివరాలు ఇలా.. ఇటీవల కురిసిన వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ అంబేద్కర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. చెత్తను తొలగించాలని పాఠశాల హెచ్ఎం ఎన్ వెంకటేశ్వరరావు పంచాయతీ అధికారులు, సిబ్బందికి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదు. చేసేదేమీ లేక.. ప్రధానోపాధ్యాయుడు కలుపు మొక్కల నివారణ కోసం శనివారం పంపు తీసుకొచ్చి స్వయంగా మందు పిచికారీ చేశారు.
చెత్తాచెదారం ఎండిపోయిన తర్వాత తొలగించాలని నిర్ణయించారు. హెచ్ఎం కలుపు నివారణ మందు పిచికారీ చేస్తుండగా కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. గ్రామస్తులు ఆయన చొరవను అభినందించారు. అదే సమయంలో పంచాయతీ పాలకవర్గం తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో పంచాయతీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి బెదిరింపులకు దిగినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

