హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : కుల గణనలో క్రమశిక్షణా చర్యలు, షాకాజ్ నోటీసుల పేరుతో టీచర్లను బెదిరిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆరోపించారు. ఇలా టీచర్లను వేధింపులకు గురిచేస్తే సర్వే సక్రమంగా జరగదని వారు అభిప్రాయపడ్డారు.
కుల గణన సర్వే గడువును పొడిగించాలని డీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఇండ్ల సంఖ్యను తగ్గించాలని, ఎన్యుమరేటర్లను పెంచాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి కోరారు.