ఎయిర్పోర్ట్కు మరో 5 రూట్లలో ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో 5 రూట్లలో టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనున్నది.
- సికింద్రాబాద్-పటాన్చెరు నడుమ 8 ఏసీ బస్సులు
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మరో 5 రూట్లలో టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపనున్నది. ఇప్పటికే ఎయిర్పోర్ట్కు 40కిపైగా ఎలక్ట్రిక్ బస్సులు నగరం నలువైపుల నుంచి తిరుగుతుండగా, మరో 5 రూట్ల నుంచి నాన్ ఏసీ బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు గురువారం ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో సాధారణ టికెట్ ధరలే ఉంటాయని, మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు. సికింద్రాబాద్-పటాన్చెరు మధ్య మెట్రో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. రూట్ నంబరు 219లో 8 బస్సులు ఈ మార్గంలో శుక్రవారం నుంచి నడుస్తాయి. ప్రతి 24 నిమిషాలకు ఓ బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 6.10, పటాన్చెరు నుంచి ఉదయం 7.45కి మొదటి బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కొత్త రూట్లు ఇవే..
- రూట్నంబర్-303: కొండాపూర్ నుంచి 4 సిటీ ఆర్డినరీ సర్వీసులు
- రూట్ నంబర్ 90ఎల్ -251ఎ బస్సు : సికింద్రాబాద్ నుంచి 4 మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు
- రూట్ నంబరు 295ఏ : కేపీహెచ్బీ మెయిన్ రోడ్డు నుంచి 4 ఆర్డినరీ బస్సులు
- రూట్ నంబరు 229-95ఏ: సుచిత్ర నుంచి 5 మెట్రో ఎక్స్ప్రెస్లు
- రూట్ నంబర్ 3కే-95ఏ: ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి 4 మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

