హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఆర్టీసీకి అరుదైన గౌరవం దకింది. రోడ్డు రవాణా సంస్థలలో ముఖ్య భూమిక పోషించే ఏఎస్ఆర్టీయూ (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా టీఎస్ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ సూర్య కిరణ్ నియమితులయ్యారు. సూర్యకిరణ్‌ను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ అభినందించారు. అనేక ఏండ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన సూర్యకిరణ్‌కు ఈ స్థానం దక్కడం స్ఫూర్తిదాయకమని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఆటోలు, క్యాబ్‌ల బంద్‌తో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
బుధవారం అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌ల బంద్‌తో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదనపు బస్సులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇతర ముఖ్య పట్టణాల్లోనూ రద్దీకి తగ్గట్టుగా బస్సులను సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు.