హైదరాబాద్ : మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి నియామక పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలకు ఒక్కో పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసింది. అలాగే మహిళా, శిశు సంక్షేమశాఖ సూపర్ వైజర్ పోస్టుల పరీక్ష తుది కీని విడుదల చేసింది. గతేడాదిలో మహిళా, శిశు సంక్షేమశాఖలోని 23 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది. గత డిసెంబర్లో పరీక్షలు నిర్వహించగా.. తాజాగా ఫలితాలను ప్రకటించింది. మహిళా, శిశు సంక్షేమశాఖలో 181 సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆగస్ట్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే.