హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ) : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ఏ,బీ) పోస్టుల భర్తీకి ఈ నెల 15, 16న నిర్వహించే రాత పరీక్షలకు శుక్రవారం నుంచి హాల్టికెట్లు జారీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను https://www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.