హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 113 పోస్టులకు కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫిషన్ ఇచ్చింది. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సీఎం కేసీఆర్ గత అసెంబ్లీలో 80వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1, పోలీసుశాఖతో పాటు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.