‘ఫలక్‌నుమా దాస్’ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలతో దర్శకుడిగా, రచయితగా కూడా సత్తా చాటారు యువహీరో విశ్వక్సేన్. తాజాగా ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కల్ట్’. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. గురువారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్సేన్ రక్తంతో తడిసిన గొడ్డలి పట్టుకొని నడుస్తూ కనిపిస్తున్నారు. భారతదేశంలో తొలి స్లాషర్ ఫిల్మ్‌గా(హత్యలు, రక్తపాతం నేపథ్యంలో సాగే హారర్ సినిమా) రూపొందిస్తున్నామని, సరికొత్త ప్రయత్నంగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ద్వారా 40 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారని చిత్రబృందం తెలిపింది. గాయత్రీ భరద్వాజ్, తారక్ పొన్నప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సంభాషణలు: తరుణ్‌భాస్కర్, రచన, నిర్మాత, దర్శకత్వం: విశ్వక్సేన్.