న్యూఢిల్లీ: టెక్సాస్లోని హూస్టన్ నగరంలోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఉన్న 90 అడుగుల హనుమాన్ విగ్రహంపై మాగా మద్దతుదారుడు కార్లోస్ టుర్సియోస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ విగ్రహం వలసదారుల దండయాత్రకు నిదర్శనమని పేర్కొన్నాడు. వలసదారులు రోజురోజుకూ టెక్సాస్ను ఆక్రమించుకుంటుపోతున్నారని ఎక్స్ వేదికగా తెలిపాడు.
అమెరికాలో హిందూ దేవుళ్ల విగ్రహం ఎందుకని ప్రశ్నించాడు. కార్లోస్ వ్యాఖ్యలపై ఆలయానికి చెందిన కమ్యూనిటీ తీవ్రంగా ఖండించింది. గతంలో కూడా ఇలాంటి విగ్రహాలను మేమెందుకు అనుమతించాలంటూ రిపబ్లికన్ పార్టీ నేత అలగ్జాండర్ డంకన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.