మన దేశంలో దాదాపు 70% మంది మహిళలు ఏదో ఒక రకమైన గైనకాలజికల్ సమస్యతో బాధపడుతున్నారట. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్), క్రమరహిత పీరియడ్స్, గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లతో సతమతం అవుతున్నారట. మారుమూల ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, పట్టణాలు, నగరాల్లో అవగాహన లేమితోనే.. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి.. ఉత్తమ మార్గాలను వివరిస్తున్నారు.