‘నేటి జనరేషన్ ఎంత వేగంగా ప్రేమలో పడుతున్నారో.. అంతే వేగంగా విడిపోతున్నారు. బ్రేకప్ తర్వాత నేటి యువత ఎలా సఫర్ అవుతున్నారు? ఎలాంటి డిప్రషన్‌కి వెళ్తున్నారు. ఆ బాధను ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘బూకీ’. ఇది బ్రేకప్‌తో మొదలయ్యే ప్రేమకథ’ అని నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ అన్నారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న టీనేజ్ లవ్‌స్టోరీ ‘బూకీ’. అజయ్ దిషన్, ధనుషా జంటగా నటించారు. గణేష్‌చంద్ర దర్శకుడు. విజయ్ ఆంటోని సమర్పిస్తున్న ఈ చిత్రంలో సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు విలేకరులతో ముచ్చటించారు. ‘హీరోహీరోయిన్లు అజయ్, ధనుషాలకు మంచి పేరు తెచ్చే సినిమా ఇది. డైరెక్టరే డీవోపీ కావడంతో సినిమా అద్భుతంగా వచ్చింది. విజయ్ ఆంటోని సంగీతం ఈ సినిమాకు ఎస్సెట్.
ముఖ్యంగా నేపథ్య సంగీతం సూపర్. ైక్లెమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. ఇందులో విజయ్ ఆంటోని ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. అలాగే సునీల్, మంచు లక్ష్మి పాత్రలు కూడా కొత్తగా ఉంటాయి’ అని తెలిపారు రామాంజనేయులు. సత్యదేవ్ హీరోగా తాము నిర్మిస్తున్న సినిమా పూర్తయిందని, విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్లు’ సినిమాను మేలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.