TSPSC | అక్టోబర్లో గ్రూప్-3 పరీక్ష.. వారం, పది రోజుల్లో తేదీల ప్రకటన..!
TSPSC | గ్రూప్-3 పరీక్ష అక్టోబర్ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయమై కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టు సమాచారం.
TSPSC | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-3 పరీక్ష అక్టోబర్ నెలలో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయమై కమిషన్ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభిప్రాయానికి కమిషన్ వచ్చినట్టు సమాచారం. మరో వారం, పది రోజుల్లో గ్రూప్-3 పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించనున్నట్టు తెలిసింది.
అక్టోబర్ నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్-3 పరీక్ష తేదీలను పరిశీలిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలలోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్-3 క్యాటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

