హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల ఫలితాలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీబీపీవో), డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్, రవాణా శాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. మెరిట్ ప్రకారం జనరల్ ర్యాంకింగ్ జాబితాలను అందుబాటులో ఉంచింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది.