హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఏఈఈ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్) పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ని టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఏవైనా సందేహాలుంటే ఈనెల 17 నుంచి 19 సాయంత్రం 5 గంటల లోగా ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని అభ్యర్థులను కోరింది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధార వివరాలను జతచేయాలని పేర్కొన్నది. అభ్యర్థుల సమాధాన పత్రాలు (రెస్పాన్స్ షీట్స్) టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో జూన్ 15 వరకు అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ సెక్రటరీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.