హైదరాబాద్ : తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( TSPECET-2021 ) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో చైర్మన్ ఆర్ లింబాద్రి, పీఈ సెట్ చైర్మన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ గోపాల్ రెడ్డి కలిసి ఫలితాలను విడుదల చేశారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల ప్రవేశ పరీక్షల్లో 96.99 శాతం ఉత్తీర్ణత సాధించారు.
బీపీఈడీ కోర్సుకు 1212 మంది పురుషులు పరీక్ష రాయగా, 1188 మంది(98.02 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 632 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరు కాగా, 599 మంది(94.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. డీపీఈడీ కోర్సుకు 846 మంది పురుషులు పరీక్ష రాయగా, 825 మంది (97.52 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 397 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరు కాగా, 382 మంది(96.22 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు ఫలితాలను https://pecet.tsche.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు.