హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరించేందుకు తగిన సహకారం అందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ సంఘం (టీఎస్సీపీఎస్ఈయూ) కోరింది. శనివారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రిని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తదితరులు కలిశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. సీపీఎస్‌తో 1.72 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సీపీఎస్ఈయూ సంకల్పయాత్రకు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.