TS Weather | తెలంగాలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని వెల్లడించింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో మరికొన్ని జిల్లాలో వర్షాలు పడుతాయని అంచనా వేసింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.