హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో సీపీఎస్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో మహాధర్నా నిర్వహించారు.
ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షుడి హో దాలో ధర్నాకు హాజరైన చావ రవి మాట్లాడుతూ.. ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతంచేసి ఓపీఎస్‌ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి జంగ య్య, నాగమణి, శ్రీనివాసచారి, సృజన్‌కుమార్, ఎల్లయ్య, కిరణ్‌కుమార్ ధర్నాలో పాల్గొన్నారు.
ఎన్వోసీల జారీ అధికారం డైరెక్టర్‌కు
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల విదేశీ పర్యటనకు నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ నిబంధనల్లో ప్రభుత్వం స్వల్పమార్పులు చేసింది. హెడ్మాస్టర్ల ఆరు నెలలలోపు విదేశీ పర్యటనలకు ఎన్వోసీల జారీ చేసే అధికారాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు కట్టబెట్టింది.
ఇది వరకు హెచ్ఎంలు, ఇతర గెజిటెడ్ అధికారులకు మూడు నెలలలోపు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఆరు నెలలపు పర్యటనలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఎన్వోసీలు జారీచేసేది. ఆ తర్వాత ఐదేండ్ల లోపు వరకు ప్రభుత్వం ఎన్వోసీలిచ్చేది. తా జాగా డీప్యూటీ ఈవోలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, గెజిటెడ్ హెడ్మాసర్లు ఆరు నెలలలోపు పర్యటనలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి ఎన్వోసీ తీసుకు ంటే సరిపోతుంది. ఆ తర్వాత ఐదేండ్ల లోపు ఎన్వోసీ కోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.