TS TET 2023 | ఈ నెల 27న టెట్ ఫలితాల వెల్లడి
TS TET 2023 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఎప్పుడూ కఠినంగా వచ్చే పేపర్-1 ప్రశ్నాపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్-2 మాత్రం కఠినంగా ఇచ్చారు.
TS TET 2023 | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం సజావుగా ముగిసింది. ఉదయం పేపర్-1కు 84.12%, మధ్యాహ్నం పేపర్ -2కు 91.11% మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఎప్పుడూ కఠినంగా వచ్చే పేపర్-1 ప్రశ్నాపత్రం ఈసారి సులభంగా వచ్చింది. పేపర్-2 మాత్రం కఠినంగా ఇచ్చారు. దీనిలో కొన్ని ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉన్నాయి.
అభ్యర్థుల్లో లోతైన విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేలా ప్రశ్నపత్రం రూపొందించారని నిపుణుల అంచనా. ఈ పరీక్షల ఫలితాలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఇదిలా ఉండగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు కొన్నిచోట్ల ఒక పేపర్కు బదులు మరో పేపర్.. ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి ఓఎమ్మార్ను పంపిణీ చేయడం, ఆ తర్వాత తప్పిదాలు జరిగినట్టుగా గుర్తించడంతో వైట్నర్తో చెరిపివేశారు. వైట్నర్ వాడిన ఓఎమ్మార్ షీట్లు చెల్లుబాటవుతాయని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
చవితి తర్వాతే ప్రాథమిక కీ
టెట్ ప్రాథమిక కీని మూడు, నాలుగు రోజుల్లో వెబ్సైట్లో పెడతారు. తాజా సమాచారం ప్రకారం వినాయక చవతి తర్వాతే కీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తొలుత అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటి ప్రకారం తుది కీ ప్రకటిస్తారు. అయితే అక్కడక్కడ ఓఎమ్మార్ షీట్ల పంపిణీలో తప్పిదాలు జరిగాయి.
caption id=”attachment_1253774″ align=”alignnone” width=”785″]
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

