అంతర్జాతీయ ప్రమాణాలలో కోహెడ మార్కెట్
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందుకు 178 ఎకరాల విస్తీర్ణంలో కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మండీ చైర్మన్ అదిల్‌ఖాన్ ఆహ్వానం మేరకు శుక్రవారం దేశంలో అతిపెద్ద ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీని మంత్రి నిరంజన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి సందర్శించారు.
- 178 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
- ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీ సందర్శనలో మంత్రి నిరంజన్‌రెడ్డి బృందం
హైదరాబాద్, మార్చి 25 (నమస్తేతెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అందుకు 178 ఎకరాల విస్తీర్ణంలో కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. మండీ చైర్మన్ అదిల్‌ఖాన్ ఆహ్వానం మేరకు శుక్రవారం దేశంలో అతిపెద్ద ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీని మంత్రి నిరంజన్‌రెడ్డి, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యానశాఖ కమిషనర్ ఎల్ వెంకట్రామిరెడ్డి సందర్శించారు. పండ్లు, కూరగాయలు, పసుపు మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించారు. 1995లో 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆజాద్‌పూర్ మండీలో ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం నడుస్తున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నదని, కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం సుస్థిరం అవుతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

