హైదరాబాద్: దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలో (SPDCL) 70 అసిస్టెంట్ ఇంజనీర్, 201 సబ్ ఇంజినీర్, 1000 లైన్మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు నేటినుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు జూన్ 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈనేపథ్యంలో జూలై 11 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు tssouthern power.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.