ఉస్మానియా యూనివర్సిటీ, మా ర్చి 13: టీఎస్ సెట్ 2022 పరీక్ష లు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్టు సెట్ సభ్యకార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
ఈ నెల 14, 15, 17 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెం డు సెషన్లలో ఈ పరీక్షలు ఉంటాయ ని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.