TS Minister Satyavathi Rathod | వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 2025 వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మహా మేడారం జాతరకు మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విషయమై రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం సమీక్షించారు. వివిధ శాఖల ద్వారా మౌలిక వసతుల కల్పనకు శాఖల వారీగా అంచనాలతో చేపట్టవలసిన పనులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగ జ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్, ఓఎస్డీ అశోక్ కుమార్, గ్రంధాలయ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ పూజారి జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య, డీపీఓ వెంకయ్య, ఆర్ అండ్ బీ ఈ ఈ వెంకటేష్, పంచాయతీరాజ్ ఈ ఈ దిలీప్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ హేమలత, పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, జిల్లా సహకార అధికారి సర్దార్ సింగ్, డిప్యూటీ డైరెక్టర్ (టీడబ్ల్యూ) ఐటీడీఎ పోచం, డీడబ్ల్యూఓ ప్రేమలత, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.