నల్లగొండ, మార్చి 6 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్, టీఎస్ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి నోటిఫికేషన్ను విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారంతో ఎంజీయూ టీఎస్ ఐసెట్-2025 నిర్వహిస్తున్నది. ఇందుకుగానూ ఈ నెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వీసీ తెలిపారు.