హనుమకొండ చౌరస్తా, జూన్ 4: తెలంగాణలో 2024-25 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధ, గురువారాల్లో ఐసెట్ నిర్వహించనున్నట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్ నరసింహాచారి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాల్లో జరిగే టీజీఐసెట్-2024కు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 86,514 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నట్టు పేర్కొన్నారు.
5వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు, 6వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.