వరంగల్ : టీఎస్ ఐసెట్-2022 పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ సెమినార్ హాల్లో విడుదల చేయనున్నట్లు టీఎస్ఐసెట్ కన్వీనర్ రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఆర్ లింబాద్రితోపాటు కేయూ వీసీ, టీఎస్ ఐసెట్ చైర్మన్ రమేశ్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఫలితాల కోసం icet.tsche.ac.in అనే వెబ్సైట్ను సందర్శించొచ్చు.
ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 మంది హాజరుకాగా, 7171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.