కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక
కరోనా | కరోనా పరిస్థితులపై రాష్ర్ట ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు నివేదిక

హైదరాబాద్ : కరోనా పరిస్థితులపై రాష్ర్ట ప్రభుత్వం తరపున పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ.. హైకోర్టుకు నివేదిక సమర్పించాయి. రాష్ర్టంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. గత నెల 29న లక్ష కరోనా పరీక్షలు నిర్వహించామని గుర్తు చేశారు. రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 శాతం మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.
ప్రయివేటు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్‌లతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే 79 ఆస్పత్రులకు 115 షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 10 ఆస్పత్రులకు కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 744 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. బ్లాక్ ఫంగస్ ఔషధాలకు దేశ వ్యాప్తంగా కొరత ఉంది. ఈ చికిత్సకు ఔషధాలు కొనుగోలు చేస్తున్నాం. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1500 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కరోనా చికిత్సకు కూడా తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయన్నారు. మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్‌ను పెంచుతున్నాం. నీలోఫర్ ఆస్పత్రిని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశాం. మూడో దశకు అవసరమైన మందులను ముందే కొనుగోలు చేస్తాం. సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ప్రజలను అప్రమత్తం చేస్తామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

