హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించి వీలైనంత ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని సీఎం శాసన సభలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ఆయా శాఖల అధికారులతో పలు దఫాలుగా చర్చించారు. మొత్తం 80,039 పోస్టులకు గాను తొలి విడుత 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇవాళ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదలయ్యాయి.
టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్-1 పోస్టులు, పోలీస్ నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీస్‌శాఖలో 16,587 పోస్టులు, రవాణాశాఖలో 63 పోస్టులను పోలీస్‌శాఖ ద్వారా, టీఎస్ పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూనియర్ అసిస్టెంట్లు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అలాగే టీఎస్పీఎస్సీ ద్వారా వైద్యారోగ్యశాఖలో 2,662, రవాణాశాఖలో టీఎస్పీఎస్సీ ద్వారా 149, మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూమెంట్ బోర్డు ద్వారా 10,028 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
గ్రూప్-1 పోస్టులు
పోలీస్ శాఖ (డీజీపీ & ఎస్పీఎఫ్ )
జైళ్ల శాఖ
రవాణా శాఖ
వైద్యారోగ్యశాఖ