SHG | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడుల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం జీవో5 జారీ చేశారు. బడుల్లో మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలతో కూడిన విలేజ్ ఆర్గనైజేషన్స్, పట్టణ ప్రాంతాల్లోని ఏరియా లెవల్ ఫెడరేషన్స్‌కు బడుల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తారు. శానిటేషన్, యూనిఫారాలు, మధ్యాహ్నం భోజనం సహా మొత్తం 10 అంశాలను ఎంపిక చేసి వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలప్పగించారు. గ్రామ, ఏరియా ఫెడరేషన్ అధ్యక్షురాలు ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉంటారు. సంబంధిత పాఠశాల హెచ్ఎం మెంబర్ కన్వీనర్ అండ్ కోఆర్డినేటర్‌గా ఉంటారు. ఈ కమిటీకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ త్వరలోనే జారీచేయనున్నది. తాజాగా, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటుతో ఇప్పటివరకు పాఠశాల నిర్వహణను పర్యవేక్షించే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు రద్దు కావడం ఖాయమని అధికారుల ద్వారా తెలిసింది. అయితే, దీనిపై మార్గదర్శకాల్లో పూర్తి స్పష్టత రానున్నది.
అప్పగించే పది అంశాలివే..