హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కడప తరహా రౌడీయిజం, రాజకీయాలు తెలంగాణలో సాగవని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ తెలుసుకోవాలని టీఎస్ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ సూచించారు. బిడ్డ, తల్లి పోలీసులపై దాడి చేసి దురుసుగా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు, శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు బీజేపీ కనుసన్నల్లో షర్మిల పనిచేస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేయడం షర్మిల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. కడపలో చేసినట్టు తెలంగాణలో రౌడీయిజం చేయాలనుకుంటే వారి ఆటలు ఇక్కడ సాగబోవని హితవు పలికారు.