హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఎడ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువును అధికారులు ఈ నెల 10 వరకు పొడిగించారు. రూ.250 ఆలస్య రుసుముతో ఈ నెల 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు.
ఈ నెల 13 నుంచి 15 వరకు దరఖాస్తుల ఎడిటింగ్‌కు అవకాశమివ్వగా, ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తారు. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.