హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎప్‌సెట్ పరీక్షలు ఈ నెల 7న ప్రారంభం కాగా, శనివారంతో ముగిశాయి. ఈ నెల 25న లేదా 27న ఫలితాల విడుదలకు జేఎన్టీయూ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు.
శనివారం మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ పరీక్షాకేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. శనివారం నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 94శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.