TG EAMCET | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : టీజీ ఎప్‌సెట్ ఫలితాలను విద్యార్థులు దరఖాస్తు సమయంలో రిజిస్టర్డ్ చేసుకున్న సెల్‌ఫోన్ నంబర్‌కే పంపించేలా జేఎన్టీయూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలు ఈనెల 29 నుంచి మే నెల 4 వరకు జరగనున్నాయి.
ఈసారి 3.05లక్షల మంది విద్యార్థులు ఎప్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత 10రోజుల్లో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఫలితాలను వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఈసారి విద్యార్థుల సెల్‌ఫోన్ నంబర్‌కే పంపించాలని నిర్ణయించారు. దీంతో అభ్యర్థులకు వెబ్సైట్లో వెతకాల్సిన తిప్పలు తప్పుతాయి.