మే 12,13,14న ఇంజినీరింగ్ పరీక్షలు
టీఎస్ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు నిర్వహించే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంసెట్ ఫార్మసీ పరీక్షల తేదీల్లో మార్పు లేదని, గత షెడ్యూల్ ప్రకారమే మే 10, 11న ఉంటాయని పేర్కొన్నారు.
- ఎంసెట్ షెడ్యూల్లో మార్పులు
- కొత్త తేదీల ప్రకటన
- నీట్, టీఎస్పీఎస్సీ పరీక్షల కారణంగా వాయిదా
- ఫార్మసీ ప్రవేశ పరీక్షలు యథాతథం
- ఉన్నత విద్యామండలి వెల్లడి
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : టీఎస్ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు నిర్వహించే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంసెట్ ఫార్మసీ పరీక్షల తేదీల్లో మార్పు లేదని, గత షెడ్యూల్ ప్రకారమే మే 10, 11న ఉంటాయని పేర్కొన్నారు. నీట్ యూజీ ఎగ్జామ్‌ను మే 7న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందిపడకుండా ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీలకు మార్పు చేశారు. దీంతో ఎంసెట్ పరీక్షలు ఇంజినీరింగ్‌తో కాకుండా, అగ్రికల్చర్, ఫార్మసీతో ప్రారంభంకానున్నాయి.
ఎంసెట్‌కు 1.92 లక్షల దరఖాస్తులు
ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. శుక్రవారం వరకు 1,92,858 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్‌కు 1,23,129, అగ్రికల్చర్, మెడికల్‌కు 69,233, ఇంజినీరింగ్, అగ్రికల్చర్మెడికల్ రెండింటికి కలిపి 223 దరఖాస్తులు నమోదైనట్టు ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్ వెల్లడించారు. దరఖాస్తుల తుది గడువు ఏప్రిల్ 10 కాగా, ఆలస్యరుసుంతో మే 2 వరకు ఉన్నదని తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
పరీక్షల తేదీలివే
అగ్రికల్చర్, మెడికల్ : 10,11 మే, 2023
ఎంసెట్ ఇంజినీరింగ్ :12, 13, 14 మే, 2023
పరీక్షాసమయం
ఉదయం 9 గంటల నుంచి
మధ్యాహ్నం 12 గంటల వరకు
మధ్యాహ్నం 3 గంటల నుంచి
సాయంత్రం 6 గంటల వరకు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

