30, 31న ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ ఎగ్జామ్స్
- ఆగస్టు 1న ఈసెట్
- ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీవర్షాల కారణంగా వాయిదా పడిన ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్స్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 30, 31న ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు కాగా, ఆగస్టు 1న ఈసెట్ నిర్వహిస్తారు. ఈ నెల 28 నుంచి ఈసెట్ హాల్‌టికెట్లు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని లింబ్రాది కోరారు. ఎంసెట్ కొత్త హాల్‌టికెట్ల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
పీజీఈసెట్ వాయిదా..
ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణతో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్‌ను వాయిదావేశారు. ముందుగా ఈ పరీక్షలు ఈ నెల 29 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించాల్సి ఉన్నది. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ ఎగ్జామ్స్‌ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

