e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home Top Slides హాట్‌కేక్‌.. సీఎస్‌ఈ, ఐటీ

హాట్‌కేక్‌.. సీఎస్‌ఈ, ఐటీ

  • ఈ రెండు కోర్సుల్లో 99 శాతం సీట్లు భర్తీ
  • ఇంజినీరింగ్‌లో నిండిన 82.27 శాతం సీట్లు
  • ఎంసెట్‌ మొదటివిడత సీట్ల కేటాయింపు పూర్తి
  • 23 వరకు సెల్ప్‌ రిపోర్టింగ్‌కు అవకాశం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ): ఎంసెట్‌లో సీఎస్‌ఈ, ఐటీ కోర్సులు హాట్‌ కేకుల్లా మారాయి. కొత్త కోర్సులు ఎన్ని వచ్చినా బీటెక్‌ విద్యార్థులువీటినే ఎంచుకుంటున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)కు మొత్తం 18,614 సీట్లుంటే 18,561 (99.72 %), ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ (ఐటీలో) 5,262 సీట్లుంటే 5,223 (99.26%) సీట్లు భర్తీకావడం సీట్లు ఇందుకు నిదర్శ నం. కొత్త కోర్సులైన సీఎస్‌ఈ ఆర్టిఫిషియల్‌ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ లో 92, సీఎస్‌ఈ డాటాసైన్స్‌లో 91.52, సీఎస్‌ఈ సైబర్‌ సెక్యూరిటీలో 85.33 శాతం సీట్లు నిండాయి. ఎంసెట్‌తొలివిడత సీట్ల కేటయింపును సాంకేతిక విద్యాశాఖ అధికారులు శనివారం పూర్తిచేశారు. ఇంజినీరింగ్‌లో 82.27 శాతం, ఫార్మసీలో 5.42 శాతం సీట్లుభర్తీకావడం గమనార్హం. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23 లోపు ట్యూషన్‌ ఫీజును చెల్లించి ఆన్‌లైన్‌ సెల్ప్‌రిపోర్టింగ్‌ చేయాలని సాంకేతిక విద్యాశాఖకమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ సూచించారు. ట్యూషన్‌ ఫీజు చెల్లించని పక్షంలో సీటు కోల్పోయినట్లేనని హెచ్చరించారు.

ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ వివరాలు

15 వర్సిటీ కాలేజీల్లో 3,994 సీట్లుం టే, 3,852 (96.44 శాతం) నిండాయి. 2 ప్రైవేట్‌ వర్సిటీల్లో 1,565 సీట్లుంటే, 1,394 (89.07శాతం), 158 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 68,512 సీట్లుంటే 55,695 (81.29 శాతం) సీట్లు భర్తీఅయ్యాయి. ఎంసెట్‌ అధిక వెబ్‌ఆప్షన్లతోచరిత్ర సృష్టించింది. గతంలో విద్యార్థులు 24 లక్షల వెబ్‌ఆప్షన్లు ఎంచుకోగా, ఈ ఏడాది 34 లక్షల వెబ్‌ ఆప్షన్లను ఎంచుకున్నారు. ఆరు యూనివర్సిటీకాలేజీలుసహా 25 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. ప్రముఖ కాలేజీల్లో సీట్లన్నీ నిండగా.. నాసిరకం కాలేజీల్లో సీట్లు ఖాళీగాన్నాయి.

ఫార్మసీలో ఐదు శాతమే..

- Advertisement -

బీఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రస్తుతానికి 5.42 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 115 కాలేజీల్లో 4,199 సీట్లు ఉండగా, 228 సీట్లు మాత్రమేనిండగా, 3,971 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఎంపీసీ విద్యార్థులు మాత్రమే వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోగా, ఇంటర్‌లో బైపీసీ పూర్తిచేసినవారు నీట్‌ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.

ఈడబ్ల్యూఎస్‌ తొలి ఫలితం

అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉద్యోగరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పది శాతం రిజర్వేషన్‌ ఫలాలను ఎంసెట్‌ విద్యార్థులు తొలుత అందిపుచ్చుకున్నారు. ఈ కోటాలో 5,108 మంది కన్వీనర్‌ కోటా సీట్లను పొందారు. ఏడు వేలకుపైగా సూపర్‌న్యూమరరీ సీట్లను పెంచారు. ఈ కోటాలో 21వేల మంది విద్యార్థులు ఎంసెట్‌ క్వాలిపై కాగా.. ప్రస్తుతానికి 5,108 మంది సీట్లు దక్కించుకున్నారు. ఎంసెట్‌ వెబ్‌కౌన్సెలింగ్‌లో 8,624 మంది సీట్లుదక్కించుకోలేకపోయారు. రెండోవిడత కౌన్సెలింగ్‌లో వీరికి

కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు వివరాలు

  1. 71,216 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరైనవారు
  2. 69,793 వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్నవారు
  3. అందుబాటులో ఉన్న సీట్లు 78,270
  4. 61,169 సీట్లు పొందిన వారు
  5. 17,101 ఖాళీసీట్లు మొత్తం
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement