అమీర్‌పేట్, ఏప్రిల్ 28: తెలంగాణ పల్లెలు గాం ధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సం స్థ చైర్మన్ వీ ప్రకాశ్ పేర్కొన్నారు. గురువారం బేగంపేటలో నిర్వహించిన ఆలిండియా సర్వసేవా సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ‘గ్రామ స్వరాజ్యం’ అంశంపై ఆయన మాట్లాడారు.
టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న విధానాలతో తెలంగాణలోని గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, పచ్చదనం పెంపు, ఇంటింటికి రక్షిత మంచినీటి సరఫరా వంటి కార్యక్రమాలతో తెలంగాణ పల్లెలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో సంఘ్ కార్యనిర్వాహక అధ్యక్షుడు వీ అరవింద్‌రెడ్డి, ప్రముఖులు వీ ప్రబోధ్ చంద్రారెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ మహదేవ్ విదోహి, కార్యదర్శి అమన్ కిశోర్, కార్యవర్గ సభ్యుడు కే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.