మక్తల్, ఫిబ్రవరి 12 : ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన మక్తల్ నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మక్తల్ మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో భాగంగా 12వ వార్డు పోలింగ్ బూత్‌లో 1028 నంబర్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో చకర్లు కొట్టింది.
ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాల్సిన అధికారులు, అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు ఏజెంట్లుగా మారిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌ను ఎవరో ఫోన్లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.