హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ 11వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు.
1952 లో జయశంకర్ సార్ నాన్ ముల్కీ ఉద్యమంలో, తర్వాత సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఎవరు మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్.
విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో వారి పాత్ర మరవలేనిది.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.. నివాళులర్పించిన కేటీఆర్https://t.co/VrCG02Crbj
— Namasthe Telangana (@ntdailyonline) June 21, 2022