నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. మొదటి, రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 515 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల మెజార్టీ సాధించగా, రెండో రౌండ్లో బీజేపీకి 841 లీడ్ వచ్చింది. రెండో రౌండ్లో టీఆర్ఎస్కు 7781, బీజేపీ 8622, కాంగ్రెస్ 1532 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరఫున రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.