
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తో నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ముజీబుద్దీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి కేటీఆర్ సూచించారు.

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జిల్లాల అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తమపై ఉంచిన పార్టీ బాధ్యతలకు సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తామని.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ భేటీలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ , ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, హనుమంత్ షిండే, డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.