ఏ శుభ క్షణాన మొదలైందో… తొలి అడుగు ఎక్కడ పడిందో… సంకల్ప బలం ఎంత బాగుందో.. తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ్టికి 20 ఏండ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. 2001 ఏప్రిల్ 27న మొదలైన టీఆర్ఎస్, నేడు 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. స్వాభిమాన జాతికి నడిపించే నేత తోడైతే కథ ఎలా ఉంటుందో చెప్పడానికి టీఆర్ఎస్సే సజీవ ఉదాహరణ. ఆనాడు కరెంటు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కేసీఆర్ వినిపించిన ధిక్కారపు మాటే.. నేటి తెలంగాణలో కోటి ఎకరాల మాగాణంలోకి వేసిన బాట! తెలంగాణ ప్రగతి కోసం నాడు సృష్టించిన జల దృశ్యం.. నేటి తెలంగాణ సుజల దృశ్యం! ఏండ్లు గడిచి ఉండొచ్చు. కానీ తెలంగాణపై కేసీఆర్ ప్రేమ… టీఆర్ఎస్పై తెలంగాణ ప్రజల ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరుగుతున్నాయి. 20 ఏండ్ల ప్రయాణంలో మలుపులెన్నో, మైలురాళ్లెన్నో. ఒక్కొక్కటీ ఒక కథ. సాధించింది మనమేనా అనిపించే విజయ గాథ! గర్వంగా తలెత్తుకొనేలా చేసే చరిత.
కేసీఆర్ ఆవిష్కరించిన నిలువెత్తు స్వాభిమాన జెండా టీఆర్ఎస్ కేసీఆర్
తెలంగాణ తల్లికి వేసిన అస్తిత్వపు దండ టీఆర్ఎస్
కేసీఆర్ సబ్బండ వర్ణాలపై చల్లిన సంబురాల గులాల్ టీఆర్ఎస్
కేసీఆర్ ఎండిన పంట చేలకు చేసిన జలాభిషేకం టీఆర్ఎస్
కేసీఆర్ ఎగరేసిన సంక్షేమ పరిపాలన పాలపిట్ట టీఆర్ఎస్
కేసీఆర్ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ
trs అంటే.. తెలంగాణ రిజువనేషన్ స్కీం తెలంగాణ పునరుజ్జీవన పథకం
27.4.2001
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ తీరాన జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్. వేదికపై ఇతర ముఖ్య నేతలు.
ఉద్యమాన్ని ప్రారంభించిన రెండేండ్లకే 2003 ఏప్రిల్ 27న వరంగల్‌లో టీఆర్ఎస్ జరిపిన సభకు 15 లక్షల మంది హాజరై ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు తిప్పారు.2010 డిసెంబర్ 16న వరంగల్‌లోనే జరిగిన సభకు 20 లక్షల మంది హాజరై గిన్నిస్ రికార్డు సృష్టించారు.