గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, హరిత ప్రేమికుడు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టిన రోజు సందర్భంగా సంతోష్ కుమార్ ఓ అరుదైన చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ పుట్టుక నాది.. బ్రతుకంతా మీది.. అని రాశారు. అయితే కేసీఆర్ సంతోష్ కుమార్ను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇక ట్విటర్ వేదికగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతోష్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ స్టార్ సంతన్న అని కొనియాడారు. కేసీఆర్కు అత్యంత ఆత్మీయుడు, భవిష్యత్ నాయకుడు కేటీఆర్కు ప్రియమైన సోదరుడు, పచ్చని ప్రకృతి ప్రేమికుడు.. పక్షులకు ఇష్టమైన స్నేహితుడు.. అంటూ తమ ట్వీట్లలో అభిమానులు పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు.