రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను వరంగల్, జనగామ జిల్లాల్లో నిరాడంబరంగా నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు గ్రామగ్రామాన మొక్కలు నాటాయి. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నిరుపేదలకు సహాయం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే, రోడ్లకు ఇరువైపులా, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, ప్రభుత్వ స్థలాలు, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లలో మొక్కలు నాటారు. పాలకుర్తి మండలం గూడూరులో రక్తదాన శిబిరం, నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. స్టేషన్ ఘనపూర్లో మొక్కలు నాటారు. రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మొక్కలు నాటారు. ఒక్క జనగామ జిల్లాలోనే 31 వేల మొక్కలు నాటారు. జనగామ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లోకలెక్టర్ శివ లింగయ్య పాల్గొన్నారు.
సమర్థవంతమైన నాయకుడు కేటీఆర్: మంత్రి ఎర్రబెల్లి
కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడా ఆడంబరాలకు పోకుండా కేక్ కటింగ్ చేసి, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నామరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కేటీఆర్ అంతే సమర్థవంతంగా పార్టీని, పదవులను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్నదని చెప్పారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నదని వెల్లడించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని తెలిపారు. కేటీఆర్ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ శ్రేణులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.